
కానిస్టేబుల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదల
హైదారాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం కానిస్టేబుల్ రాత పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రిలిమినరీ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో.. అక్టోబర్ 23న కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్‌బీ) నిర్ణయించింది. అక్టోబర్ 23న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 9,613 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. దేహ దారుఢ్య పరీక్షల అనంతరం తుది రాతపరీక్షకు 81 వేల మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.