ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేడే! | ECI to announce schedule Assembly Elections of Maharashtra Jharkhand 2024 | Sakshi
Sakshi News home page

ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేడే!

Published Tue, Oct 15 2024 9:07 AM | Last Updated on Tue, Oct 15 2024 10:58 AM

ECI to announce schedule Assembly Elections of Maharashtra Jharkhand 2024

ఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర  ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

288 సీట్ల ఉన్న  మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.అయితే, అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇక. 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.అదేవిధంగా దాదాపు 50 స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వాటిలో జూన్‌లో అమేథీ, వయనాడ్ రెండింటి నుండి గెలిచిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానం కూడా ఉంది. వయనాడ్‌ స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో.. అధికార మహాయుతి కూటమి( బీజేపీ, శివసేన( షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్‌ పవార్‌ వర్గం), ప్రతిపక్షాల కూటమి మహా వికాస్ అఘాడి( కాంగ్రెస్, ఎన్సీపీ( శరద్ పవార్ వర్గం) శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం)పోటీ చేయనున్నాయి. అదేవిధంగా జార్ఖండ్‌లో.. ఇండియా కూటమిలో భాగంగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బీజేపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు పోటీ చేయన్నాయి.

చదవండి:  చిరాగ్‌ పాశ్వాన్‌కు జెడ్‌– కేటగిరీ భద్రత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement