
సాక్షి, సాలూరు : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 297వ రోజు షెడ్యూల్‌ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం సాలూరు నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనవిడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ముగిసింది. సాలూరు నియోజకవర్గంలోని కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకట భైరిపురం, బగ్గందొర వలస, గెడలుప్పి జంక్షన్ మీదుగా తామరఖండి వరకు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment