విజయోస్తు జగనన్న! | YS Jagan in Vizianagaram Railway Station | Sakshi
Sakshi News home page

విజయోస్తు జగనన్న!

Published Thu, Jan 10 2019 8:28 AM | Last Updated on Thu, Jan 10 2019 8:28 AM

YS Jagan in Vizianagaram Railway Station - Sakshi

అభివాదం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి

కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. కానీ తాను చేపట్టే ప్రజా సంకల్పయాత్ర 3648 కిలోమీటర్లు సాగుతుందని... తనపై ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమాలను తట్టుకోలేక కుట్రలు పురుడుపోసుకుంటాయని... ఆయనకే తెలియదు. అయితేనేం? ఎన్ని దుర్మార్గపు అవాంతరాలు ఎదురైనా అనిర్వచనీయమైన జనాభిమానం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. మృత్యుంజయుడై వచ్చిన ఆయన అడుగుముందుకే వేశారు. అనితరసాధ్యమైన మహాయజ్ఞాన్ని పూర్తిచేశారు. అ విజయోత్సాహంతోకలియుగవైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దివ్యదర్శనానికి సంసిద్ధులయ్యారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 3648కిలోమీటర్ల దూరం నడిచి ఇచ్ఛాపురం చేరుకుని ఓ చరిత్రను సృష్టించారు. ఆ చారిత్రక నేపథ్యానికి సాక్ష్యంగా రూపొందించిన విజయస్తూపాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆ అరుదైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా వెళ్లి చివరి సభకు అఘండ విజయాన్ని చేకూర్చారు. ప్రజా సంకల్పయాత్ర విజయ సంకల్ప స్ధూపాన్ని సందర్శించి తరించారు. జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన గ్రేట్‌ విక్టరీకి చిహ్నంగా అద్భుతంగాఅద్భుతంగా మలిచిన స్తూపం వద్ద ఫొటోలు దిగి ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు.

విజయనగరం నుంచి తిరుపతికి...
అశేష జనవాహిని నడుమ ప్రజా సంకల్పయాత్ర చివరి బహిరంగ సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించుకుని రోడ్డు మార్గంలో జగన్‌ బుధవారం రాత్రికి విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో రాత్రి 10.10 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లా రు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయా త్ర చేసిన ఆయన పాదయాత్ర ముగిసిన జిల్లాలో విశాఖపట్నం విమానాశ్రయం మినహా మరెక్కడికీ మరలా వెళ్లలేదు. ఎప్పుడూ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌ వెళుతుండేవారు. కానీ విజయనగరం జిల్లాలో 36  రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్‌ పాదయాత్ర చివరిలో కూడా జిల్లాకు వస్తుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా ముగించుకు న్న తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేం దుకు రైల్వే స్టేషన్‌ పరిసరాలకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంత మంతా కోలాహలం గా మారిపోయింది.

జగన న్న రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతకు జయ జయ ధ్వానాలు పలి కారు. క్షేమంగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోమం టూ వీడ్కోలు పలికారు. ప్రతిఒక్కరికీ చిరునవ్వుతో చేతులు జోడించి అభివాదం చేస్తూ జగన్‌ పయనమయ్యారు. రైల్వే స్టేషన్‌లో జగన్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి,   ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీ వాణి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స అప్పలనరసయ్య, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్ర శేఖర్, శత్రుచర్ల పరిక్షిత్‌ రాజు,  నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement