వరుస ఫెయిల్యూర్స్ నుంచి ‘చిత్రలహరి’ ఇచ్చిన ఉపశమనంతో ముందుకు వెళ్తున్న సాయి ధరమ్‌తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని ఓకే చేశాడు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ లాంటి ఫ్లాప్ సినిమాతో వెనకబడిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలె పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా చిత్రయూనిట్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘సుప్రీమ్’ తరువాత రాశీఖన్నా, సాయి ధరమ్‌తేజ్ మళ్లీ జోడిగా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్‌కు సంబంధించిన వీడియోను సాయి ధరమ్‌తేజ్ పోస్ట్ చేస్తూ... మళ్లీ సెట్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉంది. ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే షూటింగ్’అంటూ ట్వీట్ చేశాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
So good to be back on set...first day of shoot #PratiRojuPandaage @DirectorMaruthi @GeethaArts @UV_Creations pic.twitter.com/ajt2y0Cpgu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 28, 2019
Comments
Please login to add a commentAdd a comment