వరుస ప్లాఫ్‌లతో సతమతమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. చిత్రలహరి సినిమా సక్సెస్‌ను రుచి చూపించింది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా పర్వాలేదనిపించడంతో ఈ హీరో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సారి మరో హిట్‌తో పలకరించాలని కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రాజెక్ట్‌తో సిద్దమయ్యాడు.
‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో కాస్త వెనుకబడ్డ మారుతి.. మరో వైవిధ్యమైన కథతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజు పండగే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్ సోమవారం జరిగింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment