
న్యూఢిల్లీ: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు కొత్త వెర్షన్ ముందస్తు బుకింగ్స్‌ను.. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రారంభించింది. రూ.11,000 ఇనీషియల్ పేమెంట్ కింద చెల్లించి నూతన కారును బుక్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల్లో ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదల కానుండగా.. ఫిబ్రవరి తొలినాళ్లలోనే లాంచింగ్ కార్యక్రమం ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘కారు ముందు వైపు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అతివేగాన్ని తెలియజేసే వ్యవస్థ, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ నూతన వెర్షన్‌లో ఉన్నాయి.’ అని ఎంఎస్‌ఐ ప్రకటనలో పేర్కొంది.