
ప్రేమ విలువ చెప్పే నంబర్
‘‘ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతాయనిపిస్తోంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక, మహావీర్, అస్రిద్ మాధుర్, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘టోల్ ఫ్రీ నంబర్ 143’. వీఎస్ వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ వెంకట్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని మారుతి ఆవిష్కరించి నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి ఇచ్చారు. దాసరి భాస్కర్ మాట్లాడుతూ -‘‘143 అంటే ఐ లవ్ యు అని అర్థం. యువత డ్రగ్స్‌కి ఎలా బానిసలవుతున్నారో చెప్పే చిత్రం ఇది’’ అన్నారు.