లాభాల్లో స్టాక్మార్కెట్లు
Published Wed, Dec 28 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరముందన్న జైట్లీ వ్యాఖ్యలకు మంగళవారం సూపర్ ర్యాలీ నిర్వహించిన స్టాక్మార్కెట్లు నేడూ అదే ఛాయలో లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. 76.01 పాయింట్ల లాభంలో ఎగిసిన సెన్సెక్స్ , ప్రస్తుతం 60.44 పాయింట్ల లాభంలో 26,273 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 21.10 పాయింట్ల లాభంలో 8,053గా ట్రేడ్ అవుతోంది. మారుతీ, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలార్జిస్తుండగా... ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్, ఏషియన్ పేయింట్స్, భారతీ, ఎల్ అండ్ టీ నష్టాలు గడిస్తున్నాయి.
అటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్ప నష్టంలో 68.10గా ప్రారంభమైంది. డాలర్ విలువ బలపడుతుండటంతో రూపాయిలో ఒడిదుడుకులు కొనసాగుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంచనావేసిన దానికంటే అమెరికా హౌసింగ్ డేటా విడుదల కావడంతో డాలర్ విలువ భారీగా పెరుగుతోంది. దీంతో అమెరికా స్టాక్స్ లాభాల్లోకి ఎగిశాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు రూ.133 ఎగిసి, 27,170గా ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement
Advertisement