మారుతి బుకింగ్స్కు పెద్దనోట్ల రద్దు సెగ | demonetization effect: Maruti bookings decline by 20% in October-November | Sakshi
Sakshi News home page

మారుతి బుకింగ్స్కు పెద్దనోట్ల రద్దు సెగ

Published Fri, Dec 23 2016 8:02 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

మారుతి  బుకింగ్స్కు  పెద్దనోట్ల రద్దు సెగ - Sakshi

మారుతి బుకింగ్స్కు పెద్దనోట్ల రద్దు సెగ


 న్యూఢిల్లీ:  పెద్దనోట్ల రద్దు సెగ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి సుజికికి భారీగానే తాకింది.  మారుతీ సుజుకి  అక్టోబర్- నవంబర్  కాలానికి అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత ఏడాడితోపోలిస్తే  రీటైల్ అమ్మకాలు6-7 శాతం పెరుగుదలనునమోదుచేసినా  బుకింగ్స్ మాత్రం 20 శాతం క్షీణతనునమోదు చేశాయి. నగదు కష్టాల కారణంగా తమ బుకింగ్స్ డిమాండ్ 20శాతం  క్షీణించిందని మారుతి శుక్రవారం వెల్లడించింది.

డీ మానిటైజేషన్  కారణంగా ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి , ఆందోళన కారణంగా మారుతి ట్రూ వేల్యూ కేంద్రాల నుంచి అమ్మకాలు తగ్గాయని  మారుతి సుజుకి  ఇండియా (ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీభార్గవ విలేకరులతో చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 20శాతం పడిపోయాయన్నారు. గత డిశెంబర్ తో పోలిస్తే అమ్మకాలు 7 శాతం ఎగిసి మొత్తంగా పరిస్థితి కొంత మెరుగ్గా వున్నప్పటికీ,  నోట్ల రద్దు నేపథ్యంలో అమ్మకాలు తగ్గినట్టు గుర్తించామన్నారు.

భారీ విస్తరణకు
మరోవైపు మారుతి  భారీ విస్తరణకు దిగుతోంది. 2019 మార్చి నాటికి రోహతక్ ప్లాంట్ లో దాదాపు రూ.3,800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టుతెలిపింది.  ఇప్పటికే మార్చి 2016  నాటికిఈ  ప్రాజెక్టు మీద సుమారు రూ 1,700 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు.అలాగే గుజరాత్లో  ప్లాంట్ గురించి ప్రశ్నించినపుడు తయారీ ప్లాంటు  షెడ్యూల్లో ఉందనీ, ఇక్కడినుంచి  మొదటి కారు వచ్చే ఏడాది ఫిబ్రవరి కి బయటకు రావచ్చని చెప్పారు. త్వరలోనే  ఇగ్నిస్ ,బాలెనో ఆర్ఎస్ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement