Buzz: Actor Boman Irani To Play Key Role In Prabhas And Maruthi Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas-Maruthi Movie: ప్రభాస్‌-మారుతి చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు!

Published Thu, Oct 20 2022 6:27 PM | Last Updated on Thu, Oct 20 2022 7:12 PM

Buzz: Actor Boman Irani Plays Key Role Prabhas and Maruthi Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదోక రూమర్‌ తరచూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

చదవండి: ‘వరహరూపం..’ కాంతార లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు బొమన్‌ ఇరానీ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించనున్నాడని అంటున్నారు. ఇందులో ఆయన ప్రభాస్‌ తాతగా కనిపించనున్నారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా బొమన్‌ గతంలో పవన్‌ కల్యాణ్‌ అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవన్‌ కల్యాణ్‌ తాత, బడా వ్యాపారవేత్తగా కనిపించారరు. దీంతో ఈ చిత్రంలో కూడా ప్రభాస్‌ తాతగా కనిపించనున్నాడని తెలిసి మరిన్ని అంచనా నెలకొన్నాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్‌ తారల మెరుపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement