మారుతీ ఆల్టోలో యానివర్సరీ ఎడిషన్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్‌లో యానివర్సరీ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారును మార్కెట్లోకి తెచ్చి ఏడాది అయిన సందర్భంగా, ఈ పండుగల సీజన్‌లో విజయోత్సవం జరుపుకోవడానికిగాను ఈ వార్షిక ఎడిషన్‌ను అందిస్తున్నామని మారుతీ సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు. ఈ ఆల్టో 800 ధరలు రూ.3.12 లక్షల నుంచి ప్రారంభమవుతాయని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. కొత్త బాడీ గ్రాఫిక్స్, బాడీ సైడ్ మోల్డింగ్స్, కొత్త సీట్ ఫ్యాబ్రిక్ , రియర్ పార్సెల్ ట్రే వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆల్టో 800ను మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటివరకూ 2 లక్షల కార్లు విక్రయించామని పేర్కొన్నారు.
, ,