ముంబై : అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో దేశీయ సూచీలు బుధవారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 38.37 పాయింట్ల లాభంలో 28,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ తన కీలకమార్కు 8,650 దిగువకు పడిపోయింది. 10.65 పాయింట్ల స్వల్ప లాభంతో 8,643 వద్ద ట్రేడ్ అవుతోంది. అరబిందో ఫార్మా కంపెనీ క్యూ1 ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో మార్కెట్లో కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి. 5 శాతం మేర లాభాలను నమోదుచేస్తూ..నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలుస్తున్నాయి..ఐడియా సెల్యులార్ నిఫ్టీలో టాప్ లూజర్గా 4 శాతం మేర డౌన్ అయింది. వెల్సపన్ ఇండియా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. గత సెషన్లలో 36 శాతం మేర క్రాష్ అయిన ఆ కంపెనీ షేర్లు, నేటి ట్రేడింగ్లో 10 శాతం పతనమయ్యాయి.
మారుతీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ లాభాల బాటలో నడుస్తుండగా.. లుపిన్, టీసీఎస్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్పొ, టాటా స్టీల్లు సెన్సెక్స్లో నష్టాలను గడిస్తున్నాయి. ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు రేపటితో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నేడు కూడా మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడిచే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. కాగ నిన్నటి ట్రేడింగ్లో కూడా మార్కెట్లు ఒడిదుడుకులమయంగా నడిచాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.03 పైసలు బలహీనపడి 67.08గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 87 రూపాయల నష్టంతో 31,283గా ట్రేడ్ అవుతోంది.
స్వల్ప లాభాల్లో నడుస్తున్న మార్కెట్లు
Published Wed, Aug 24 2016 10:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement
Advertisement