నయనతారకు నో చెప్పిన దర్శకుడు మారుతి!
చెన్నై: ద్వందార్థాలతో చిత్రాలు తీసి యువతలో క్రేజ్ ఏర్పరుచుకున్న దర్శకుడు మారుతీ వెంకటేష్ హీరోగా 'రాధ' అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఈ సినిమాకు తొలుత నయనతారను ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి. కాగా, దీనిపై స్పందించిన మారుతీ.. వెంకీకి జోడీగా నయనతారను ఎంపిక చేయాలనుకోవడం లేదన్నాడు.ఇప్పటికే వారివురూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. మళ్లీ తిరిగి ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేయాలనుకోవడం లేదన్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో చేసే సినిమా కోసం కొత్త ముఖాన్ని అన్వేషిస్తున్నామన్నాడు. ఈ చిత్రం కోసం కాస్టింగ్ ను త్వరలో మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం అల్లు శిరీష్ తో చేస్తున్న కొత్త జంట సినిమా తొలి కాపీ విడుదలయ్యాక వెంకటేష్ తో సినిమా ఆరంభించే అవకాశం ఉంది. ఇంతకుముందు మారుతీ వెంకీకి కథ చెప్పాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సాగిపోయే ఈ చిత్రానికి 'రాధ' అనే టైటిల్ కూడా పెట్టారు. అయితే డి.సురేష్‌బాబు కొన్ని సూచనలు చేసారని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ విపరీతార్థలు వచ్చేలా సినిమాలను తెరకెక్కించిన మారుతీ అల్లు శిరీష్‌తో చేస్తున్న 'కొత్తజంట' సినిమాకు రూటు మార్చాడు. సిగరెట్ తాగడం, మందు కొట్టడం..లేకుండా ఉండేలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నాడట. దీన్ని పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కొత్త జంట సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.