‘‘మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రస్తుత తరానికి వస్తే ఎలా ఉంటుందో ‘బార్బరిక్’(Barbaric) లో చూపించారు. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. కానీ, మోహన్, రాజేశ్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని చాలా ఖర్చు పెట్టి తీశారు. ఈ మూవీ సరికొత్తగా ఉంటుంది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు.
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, సాంచీ రాయ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయ భాను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘బార్బరిక్’(Barbaric) . మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఈ మూవీ టీజర్ లాంచ్(Teaser Launch) ఈవెంట్‌కి మారుతి అతిథిగా హాజరై, విడుదల చేశారు.
ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ– ‘‘ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని విజయపాల్ రెడ్డి తెలిపారు. ‘‘బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు ఈ మూవీకి సంబంధించి నాకు మూడు అస్త్రాలు ఉన్నాయి.
ఒకరు డీఓపీ రమేశ్, రెండు ఫ్యూజన్ బ్యాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్. ఈ మూడు అస్త్రాలతో నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు మోహన్ శ్రీవత్స. ‘‘బార్బరిక్’ మినీ ‘బాహుబలి’ మూవీలా ఉంటుంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇది నాకు తొలి తెలుగు సినిమా’’ అని సాంచీ రాయ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్.
Comments
Please login to add a commentAdd a comment