ప్రభాస్ 'ది రాజాసాబ్'.. క్రేజీ హింట్‌ ఇచ్చిన బేబీ నిర్మాత! | Prabhas The Raja Saab Movie Crazy Update Goes Viral | Sakshi
Sakshi News home page

The Raja Saab Movie: ప్రభాస్ 'ది రాజాసాబ్'.. క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది!

Published Tue, Apr 16 2024 7:48 PM | Last Updated on Tue, Apr 16 2024 8:02 PM

Prabhas The Raja Saab Movie Crazy Update Goes Viral - Sakshi

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. భాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను  రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది.

అయితే మూడు నెలలుగా ది రాజాసాబ్‌ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన నిర్మాత ఎస్‌కేఎన్‌ హింట్‌ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా ఈ ట్వీట్‌కు డైరెక్టర్ మారుతి రిప్లై ఇవ్వడంతో ఫస్ట్ సింగిల్‌ అప్‌డేట్ ‍ఖాయమని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ  చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement