
ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది!
‘‘ఒకప్పుడు ప్రేమలు పెళ్లికి దారితీసేవి. ఇప్పుడు ప్రేమ వల్ల జీవితాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా ప్రేమకు ఆప్షన్లు పెరిగాయి. ఈ మీడియా ద్వారా లవ్‌లో పడిన ఓ నాలుగు పాత్రల చుట్టూ ‘రోజులు మారాయి’ తీశాం’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన కథ, స్క్రీన్-ప్లే అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ - ‘‘ఇవాళ చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడటం లేదు.
అందుకే కొత్త నటీనటుల సినిమాలకు కథా బలం ఎక్కువగా ఉండాలి. ‘రోజులు మారాయి’కి మేము అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాం. నాలుగు పాత్రల చుట్టూ సరదాగా తిరిగే కథ చివర్లో ఒక ట్విస్టుతో థ్రిల్ కలిగిస్తుంది. ఎక్కువగా రొమాన్స్ చూపించలేదు. దర్శకుడు మురళీకృష్ణ తెరకెక్కించిన విధానం సంతృప్తిగా అనిపించింది’’ అన్నారు.