ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్‌యూవీ వెహికల్స్‌కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్‌వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్‌యూవీ మార్కెట్‌ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్‌యూవీ వెహికల్స్ టెస్ట్‌లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
వెహికల్ ఒక్కటే.. కోడ్‌లు మాత్రం రెండు
మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్‌యూవీ వెహికల్స్‌ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్‌లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్‌యూవీ కోడ్ వైఎఫ్‌జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్‌లను విడగొట్టి.. అదే ప్లేస్‌లో బంపర్, ఎల్‌ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి.
అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్‌జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్‌ల్యాంప్‌తో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. రెండు ఎస్‌యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు.
మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్‌లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్‌లో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment