స్వార్థ ప్రేమికులు... | Selfish Lovers ... | Sakshi
Sakshi News home page

స్వార్థ ప్రేమికులు...

Published Wed, Mar 19 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

స్వార్థ   ప్రేమికులు...

స్వార్థ ప్రేమికులు...

నిస్వార్థ ప్రేమికులను చాలామందిని చూసి ఉంటాం. కానీ స్వార్థ ప్రేమికులను చూడాలంటే మాత్రం ‘కొత్త జంట’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మారుతి. ఇద్దరు స్వార్థపరులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారట. మారుతి తన పంథా మార్చి చేసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.


అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున పాటలను, ఏప్రిల్ మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘శిరీష్ శారీరక భాషకు సరిపోయే కథ ఇది.


‘ఖైదీ నెంబర్ 786’లోని సూపర్ హిట్ సాంగ్ ‘అటు అమలాపురం... ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేశాం. శిరీష్, మధురిమపై ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement