అటు అమలాపురం...ఇటు పెద్దాపురం... | Kotha Janta To Be Released On 1st May | Sakshi
Sakshi News home page

అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...

Published Sat, Apr 26 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...

అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...

 చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రంలోని ‘అటు అమలాపురం... ఇటు పెద్దాపురం’ పాట అప్పట్లో సూపర్‌హిట్టు. ఈ పాటను ‘కొత్త జంట’ కోసం రీమిక్స్ చేశారు. ‘సరదాగా కాసేపు’ తదితర చిత్రాల్లో నాయికగా చేసిన మధురిమపై ఈ పాట చిత్రీకరించారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ‘కొత్త జంట’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 మారుతి తనదైన శైలిలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్ని వర్గాలకూ నచ్చే విధంగా రొమాన్స్, కామెడీలను కలబోసారని నిర్మాత తెలిపారు. మారుతి మాట్లాడుతూ -‘‘అల్లు శిరీష్ శారీరక భాషకు సరిపోయే కథ ఇది. శిరీష్, రెజీనా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. శిరీష్‌ని హీరోగా నిలబెట్టే సినిమా అవుతుంది. కథా కథనాలు చాలా ఆసక్తిగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement