పండగలో... ‘కొత్త జంట’ | Kotha Janta Movie 25 Days Celebrations | Sakshi
Sakshi News home page

పండగలో... ‘కొత్త జంట’

Published Sat, May 24 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

పండగలో... ‘కొత్త జంట’

పండగలో... ‘కొత్త జంట’

 ‘‘నా దృష్టిలో డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. ‘కొత్తజంట’ విడుదలై మూడు వారాలు దాటుతున్నా... ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. కుటుంబం మొత్తం చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్‌గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా శిరీష్‌కి మంచి సక్సెస్ ఇచ్చిన మారుతితో గీతా ఆర్ట్స్ బేనర్‌లోనే మరో సినిమా తీస్తా’’ అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. ఈ చిత్రం 25 రోజుల వేడుకను శనివారం హైదరాబాద్‌లో జరిపారు.
 
 ఈ సందర్భంగా చిత్రం సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడారు. శిరీష్‌తో పెద్ద హిట్ తీయాలని కాకుండా, స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలని ఈ చిత్రం చేశానని, తన గత చిత్రాల్లా కాకుండా, బలవంతపు వినోదం లేకుండా చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోందని మారుతి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా కెరీర్‌కి ఇది చాలా ముఖ్యమైన సినిమా.     ఈ సక్సెస్‌తో నా బాధ్యత పెరిగింది. మంచి విజయాన్నిచ్చిన మారుతికి కృతజ్ఞతలు’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఇంకా నటీనటులు శ్రుతి, మధు నందన్, రవి, హరి, ఏడిద శ్రీరామ్, ప్రవీణ్, సంగీత దర్శకుడు జేబీ, ఆర్ట్ డెరైక్టర్ రమణ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement