
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అరవింద్. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు అని అందరూ అనుకుంటారు. వారే అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేశ్ (బాబీ). కానీ అల్లు అరవింద్‌కు మరో కుమారుడు కూడా ఉండేవాడన్న విషయాన్ని శిరీష్ బయటపెట్టాడు.
'మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేశ్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్ పుట్టాడు. ఐదారేళ్ల వయసులో రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడాని కంటే ముందే ఇది జరిగింది' అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.
చదవండి: మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు
చాలా నెర్వస్‌గా ఉంది, అంతా మీ చేతుల్లోనే: సమంత
Comments
Please login to add a commentAdd a comment