మారుతి దర్శకత్వంలో..? | naga chaitanya act maruthi director | Sakshi
Sakshi News home page

మారుతి దర్శకత్వంలో..?

Published Thu, Oct 1 2015 10:35 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

మారుతి  దర్శకత్వంలో..? - Sakshi

మారుతి దర్శకత్వంలో..?

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందా? ఫిలిం నగర్ వర్గాలు ఔననే అంటున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్‌తో మారుతి డీసెంట్ ఎంటర్‌టైనర్స్ తీయగలనని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి హీరోలు ముందుకు వస్తున్నారట. ముందుగా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారట. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మారుతి కథ రెడీ చేసుకునే పని మీద ఉన్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా డిసెంబర్‌లో ఆరంభమయ్యే అవకాశం ఉందని బోగట్టా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement