మెక్‌డి, హోండాలకు జీఎస్టీ నోటీసులు | Anti-profiteering: McDonald's, Lifestyle, Honda receives GST probe notice | Sakshi
Sakshi News home page

మెక్‌డి, హోండాలకు జీఎస్టీ నోటీసులు

Published Tue, Jan 2 2018 1:17 PM | Last Updated on Tue, Jan 2 2018 1:17 PM

Anti-profiteering: McDonald's, Lifestyle, Honda receives GST probe notice - Sakshi

న్యూఢిల్లీ :  హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్లు, వెస్ట్‌, సౌత్‌లోని మెక్‌డొనాల్డ్స్‌, రిటైల్‌ లైఫ్‌స్టయిల్‌, హోండా డీల్స్‌ సంస్థలు తప్పుడు జీఎస్టీతో వినియోగదారులను మోసం చేస్తున్నట్టు వెల్లడైంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నందున్న ఈ సంస్థలపై యాంటీ-ప్రాఫిటరింగ్‌ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. కనీసం ఐదు సంస్థలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సేఫ్‌గార్డ్స్‌(డీజీ సేఫ్‌గార్డ్స్‌) ఈ నోటీసులు జారీచేసింది. వాసెలిన్‌ ఉత్పత్తులపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించినప్పటికీ, ఇంకా 28 శాతమే విధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిప్పటికీ,  ఒక్క కప్‌ కాఫీ ధరను రూ.142 నుంచి తగ్గించనట్టు తెలిసింది.

డిసెంబర్‌ 29నే డీజీ సేఫ్‌గార్డ్స్‌ ఈ నోటీసులు జారీచేసింది. కానీ ఇంకా తమకు ఎలాంటి నోటీసులు అందలేదని హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్లు చెబుతోంది.  లైఫ్‌స్టయిల్‌ ఇంటర్నేషనల్‌ కూడా నవంబర్‌ 22న 28 శాతం జీఎస్టీ విధించిందని, కానీ ఆ వారం ప్రారంభంలోనే జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించినట్టు ఫిర్యాదులో తెలిసింది. ఈ విషయంపై స్పందించడానికి లైఫ్‌ స్టయిల్‌ ఇంటర్నేషనల్‌ స్పందించడానికి తిరస్కరించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ప్రయోజనాలను తమకు అందించడం లేదని 36 మంది కొనుగోలుదారులు చెప్పడంతో, ఫిరామిడ్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు కూడా ఈ నోటీసులు అందాయి. బారెల్లీకు చెందిన కారు డీలర్‌ హోండా కారు కూడా  ఎక్కువ మొత్తంలో పన్నులను విధిస్తున్నట్టు తెలిసింది. ఈ అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, యాంటీ ప్రాఫిటరింగ్‌ చర్యలు తీసుకోబోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement