ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌గా తమ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్‌ని అందిస్తోంది. ఈ జాబితాలో న్యూ హోండా అమేజ్, జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం హోండా సిటీ, ఐదవ తరం సిటీ వంటి కొన్ని మోడళ్లపై రూ.72,340 వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. హోండా అందిస్తున్న అద్భుతమైన ఈ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
హోండా అమేజ్
►కొత్త హోండా అమేజ్ కారుపై రూ. 43వేల తగ్గింపు ప్రయోజనాలతో అందిస్తోంది.
► రూ. 10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,144 వరకు FOC ఉపకరణాలను అందిస్తోంది.
► కొనుగోలుదారులు న్యూ హోండా అమేజ్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 20,000 పొందవచ్చు.
►అంతేకాకుండా, ఈ కారుపై రూ. 5000 కస్టమర్ లాయల్టీ బోనస్ , రూ. 6,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది.
5 జనరేషన్ హోండా సిటీ
►5 జనరేషన్ హోండా సిటీ కారుపై రూ. 72,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది.
మాన్యువల్ గ్రేడ్‌లు
►రూ. 30,000 వరకు నగదు తగ్గింపు
►కార్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 20,000 తగ్గింపు
►హోండా సిటీ 5వ తరం రూ. 7,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 8,000.
►కంపెనీ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది.
హోండా WR-V
► హోండా WR-V కారుపై రూ. 72,340 వరకు అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌ని ప్రకటించింది.
►రూ. 30,000 నగదు తగ్గింపు , రూ. 35,340 వరకు FOC ఉపకరణాలకు అందిస్తోంది.
►కార్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా రూ. 20,000 వరకు అందిస్తోంది.
►కస్టమర్ లాయల్టీ బోనస్‌గా రూ. 5,000 పొందవచ్చు.
►కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.7,000
► రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు
హోండా జాజ్
►5-సీటర్ హ్యాచ్‌బ్యాక్, హోండా జాజ్ కోరుకునేవారి కోసం రూ. 37,047 వరకు తగ్గింపు ఆఫర్‌ను లభిస్తుంది.
►రూ. 10,000 వరకు నగదు తగ్గింపుతో పాటు FOC ఉపకరణాలు రూ. 12,047 వరకు ఉంది.
►కార్ ఎక్స్ఛేంజ్‌లో తగ్గింపు విలువ రూ. 10,000.
►ఈ కారుపై రూ. 5,000 విలువైన కస్టమర్ లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 3,000.
►అంతేకాకుండా, రూ. 7,000 విలువైన హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది.
చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
Comments
Please login to add a commentAdd a comment