Honda company
-
ఇయర్ ఎండ్ ఆఫర్: ఆ కంపెనీ కార్లపై భారీ తగ్గింపు!
ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌గా తమ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్‌ని అందిస్తోంది. ఈ జాబితాలో న్యూ హోండా అమేజ్, జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం హోండా సిటీ, ఐదవ తరం సిటీ వంటి కొన్ని మోడళ్లపై రూ.72,340 వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. హోండా అందిస్తున్న అద్భుతమైన ఈ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం! హోండా అమేజ్ ►కొత్త హోండా అమేజ్ కారుపై రూ. 43వేల తగ్గింపు ప్రయోజనాలతో అందిస్తోంది. ► రూ. 10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,144 వరకు FOC ఉపకరణాలను అందిస్తోంది. ► కొనుగోలుదారులు న్యూ హోండా అమేజ్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 20,000 పొందవచ్చు. ►అంతేకాకుండా, ఈ కారుపై రూ. 5000 కస్టమర్ లాయల్టీ బోనస్ , రూ. 6,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. 5 జనరేషన్ హోండా సిటీ ►5 జనరేషన్ హోండా సిటీ కారుపై రూ. 72,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మాన్యువల్ గ్రేడ్లు ►రూ. 30,000 వరకు నగదు తగ్గింపు ►కార్ ఎక్స్ఛేంజ్లో రూ. 20,000 తగ్గింపు ►హోండా సిటీ 5వ తరం రూ. 7,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 8,000. ►కంపెనీ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది. హోండా WR-V ► హోండా WR-V కారుపై రూ. 72,340 వరకు అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌ని ప్రకటించింది. ►రూ. 30,000 నగదు తగ్గింపు , రూ. 35,340 వరకు FOC ఉపకరణాలకు అందిస్తోంది. ►కార్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా రూ. 20,000 వరకు అందిస్తోంది. ►కస్టమర్ లాయల్టీ బోనస్‌గా రూ. 5,000 పొందవచ్చు. ►కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.7,000 ► రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు హోండా జాజ్ ►5-సీటర్ హ్యాచ్‌బ్యాక్, హోండా జాజ్ కోరుకునేవారి కోసం రూ. 37,047 వరకు తగ్గింపు ఆఫర్‌ను లభిస్తుంది. ►రూ. 10,000 వరకు నగదు తగ్గింపుతో పాటు FOC ఉపకరణాలు రూ. 12,047 వరకు ఉంది. ►కార్ ఎక్స్ఛేంజ్లో తగ్గింపు విలువ రూ. 10,000. ►ఈ కారుపై రూ. 5,000 విలువైన కస్టమర్ లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 3,000. ►అంతేకాకుండా, రూ. 7,000 విలువైన హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
మూడు మోడళ్లకు హోండా స్వస్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 2023 మార్చి నాటికి మూడు మోడళ్లకు స్వస్తి పలుకుతోంది. వీటిలో జాజ్, డబ్యుఆర్–వీ, నాల్గవతరం సిటీ ఉన్నాయి. సమాచారం ప్రకారం.. హోండా ఇండియా అక్టోబర్ 2022 తర్వాత జాజ్, మార్చి 2023 తర్వాత హోండా డబ్యుఆర్–వీ మోడళ్లతో పాటు కంపెనీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్లలో ఒకటైన- హోండా సిటీ (నాల్గవతరం ) కూడా డిసెంబర్ 2022 నాటికి ఉత్పత్తిని కూడా నిలిపివేయనుంది. దీని ప్రకారం దేశీయ మార్కెట్లో ఇకపై హోండా కేవలం సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, అమేజ్ మోడళ్లను మాత్రమే విక్రయించనుంది. అలాగే ఎస్‌యూవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ నోయిడా ప్లాంటును మూసివేసిన తర్వాత 2020 డిసెంబర్ నుంచి సివిక్, సీఆర్–వీ మోడళ్ల ఉత్పత్తిని హోండా కార్స్ నిలిపివేసింది. కొత్త కంపెనీల రాకతో సంస్థ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జపాన్ దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హోండా సరికొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. హోండా ఈ అత్యంత ప్రసిద్ధ మోడల్‌కు హోండా ఎస్660 అని పేరు పెట్టింది. ఇది రెండు సీట్ల కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఎస్660ల తయారిని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల హోండా ప్రకటించింది. మొదటి సరిగా దీని ప్రోటో టైపు మోడల్ ను 2017 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించారు. 2019 సంవత్సరంలోనే హోండా దీని డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది. ఈ కొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారుకి కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. హోండా ఈ హ్యాచ్‌బ్యాక్, బ్లాక్-అవుట్ ఎన్క్లోజ్డ్ గ్రిల్ ఏరియా టేకు హోండా ఈ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దీని అండర్‌పిన్నింగ్స్ రియల్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను హ్యాచ్‌బ్యాక్‌తో తీసుకొచ్చింది. అదే సమయంలో 35.5kWh బ్యాటరీ తీసుకొనిరావచ్చు. ఇది 154 హెచ్‌పీ సామర్ధ్యం గల ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 220 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. అయితే రెండు డోర్ల ఎలక్ట్రిక్ కారును హోండా కంపెనీ భారత్‌కు తీసుకువస్తుందా రాదా? అనే విషయంపై సందిగ్థత ఉంది. మన దేశానికి తీసుకొనిరాకపోవడానికి ప్రధాన కారణం స్పోర్ట్స్ కారు కావడంతో పాటు దీని ధర చాలా ఎక్కువగా ఉండటమే అనిపిస్తుంది. చూడాలి మరి హోండా ఈ కారును మన దేశంలో తీసుకొస్తుందా? అనేది. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
మళ్లీ హోండా జాజ్
♦ పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభ్యం ♦ ధరల శ్రేణి రూ.5.3 లక్షల నుంచి రూ.8.59 లక్షలు సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన హోండా కంపెనీ జాజ్ మోడల్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తెచ్చింది. మూడో తరం జాజ్ మోడల్‌ను హోండా కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కొత్త జాజ్ లభిస్తుందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కత్సుషి ఇనోయుయి చెప్పారు. పెట్రోల్ వేరి యంట్ ధరలు రూ.5.3 లక్షల నుంచి రూ.7.29 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.8.59 లక్షల రేంజ్లో, ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.7.85 లక్షల రేంజ్లో ఉన్నాయని తెలిపారు. గతంలో జాజ్ కారు తయారీకి 72% స్థానిక విడిభాగాలను ఉపయోగించేవారమని, ఈ కొత్త జాజ్‌లో ఇది 90%కి పైగా పెరిగిందన్నారు. అందుకే పోటీని తట్టుకునేలా ధరలను నిర్ణయించగలిగామని చెప్పారు. ఈ కారు లీటరు డీజిల్‌తో 27.3 కి.మీ, లీటరు పెట్రోలుతో 18.7 కి.మీ మైలేజీ ఇస్తుందని కత్సుషి పేర్కొన్నారు. అమెరికా, జపాన్‌తో సహా మొత్తం 75 దేశాల్లో జాజ్ కార్లను విక్రయిస్తున్నామని.. డీజిల్ వేరియంట్‌ను ఒక్క భారత్‌లోనే ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.