
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 2023 మార్చి నాటికి మూడు మోడళ్లకు స్వస్తి పలుకుతోంది. వీటిలో జాజ్, డబ్యుఆర్–వీ, నాల్గవతరం సిటీ ఉన్నాయి. సమాచారం ప్రకారం.. హోండా ఇండియా అక్టోబర్ 2022 తర్వాత జాజ్, మార్చి 2023 తర్వాత హోండా డబ్యుఆర్–వీ మోడళ్లతో పాటు కంపెనీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్లలో ఒకటైన- హోండా సిటీ (నాల్గవతరం ) కూడా డిసెంబర్ 2022 నాటికి ఉత్పత్తిని కూడా నిలిపివేయనుంది.
దీని ప్రకారం దేశీయ మార్కెట్లో ఇకపై హోండా కేవలం సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, అమేజ్ మోడళ్లను మాత్రమే విక్రయించనుంది. అలాగే ఎస్‌యూవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ నోయిడా ప్లాంటును మూసివేసిన తర్వాత 2020 డిసెంబర్ నుంచి సివిక్, సీఆర్–వీ మోడళ్ల ఉత్పత్తిని హోండా కార్స్ నిలిపివేసింది. కొత్త కంపెనీల రాకతో సంస్థ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు!
Comments
Please login to add a commentAdd a comment