మళ్లీ హోండా జాజ్
♦ పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభ్యం
♦ ధరల శ్రేణి రూ.5.3 లక్షల నుంచి రూ.8.59 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన హోండా కంపెనీ జాజ్ మోడల్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తెచ్చింది. మూడో తరం జాజ్ మోడల్‌ను హోండా కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కొత్త జాజ్ లభిస్తుందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కత్సుషి ఇనోయుయి చెప్పారు. పెట్రోల్ వేరి యంట్ ధరలు రూ.5.3 లక్షల నుంచి రూ.7.29 లక్షల రేంజ్‌లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.8.59 లక్షల రేంజ్‌లో, ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.7.85 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు.
గతంలో జాజ్ కారు తయారీకి 72% స్థానిక విడిభాగాలను ఉపయోగించేవారమని, ఈ కొత్త జాజ్‌లో ఇది 90%కి పైగా పెరిగిందన్నారు. అందుకే పోటీని తట్టుకునేలా ధరలను నిర్ణయించగలిగామని చెప్పారు. ఈ కారు లీటరు డీజిల్‌తో 27.3 కి.మీ, లీటరు పెట్రోలుతో 18.7 కి.మీ మైలేజీ ఇస్తుందని కత్సుషి పేర్కొన్నారు. అమెరికా, జపాన్‌తో సహా మొత్తం 75 దేశాల్లో జాజ్ కార్లను విక్రయిస్తున్నామని.. డీజిల్ వేరియంట్‌ను ఒక్క భారత్‌లోనే ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.