Jazz
-
International Jazz Day: జాజ్ జాజిమల్లి
జాజ్ జాజిమల్లికి కొత్త అందాన్ని తీసుకువస్తోంది ముంబైకి చెందిన ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. జాజ్ డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. ముంబైలోని ఆల్–ఉమెన్ జాజ్ టీమ్‌లో శ్వేతన్ కన్వర్, రాధిక మాయాదేవ్, రోషిణి నాయర్, వేదిక అగర్వాల్, దీక్ష, రియా సూద్ అనే డ్యాన్సర్లు ఉన్నారు. ‘స్టీరియోటైప్‌ను బ్రేక్ చేయడానికి జాజ్ టీమ్ ప్రారంభించాం’ అంటుంది ఫౌండర్ శ్వేతన్ కన్వర్.\ డెహ్రాడూన్‌కు చెందిన శ్వేతన్ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్ డ్యాన్స్ ఇప్పుడు తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఊహించలేదు. ‘జాజ్ డ్యాన్స్ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు’ అంటుంది శ్వేతన్. రాధిక మాయదేవ్ పదహారు సంవత్సరాల వయసు నుంచే జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డుచెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తరువాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు. కామర్స్ స్టూడెంట్ అయిన రోహిణి నాయర్ మొదట భరతనాట్యం చేసేది. ఆ తరువాత జాజ్ డ్యాన్స్‌లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది. ‘మా అమ్మాయి జాజ్ డ్యాన్సర్’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి. ‘ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడూ నిలవనీరులా ఉండకూడదు’ అంటున్న వేదిక అగర్వాల్ జాజ్‌కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్ డ్యాన్స్ అనగానే శాక్స్ఫోన్ శబ్దాలు, ఇంగ్లీష్ పాటల లిరిక్స్ వినిపిస్తాయి. ‘అలా మాత్రమే ఎందుకు!’ అంటూ ఈ టీమ్ జాజ్ డ్యాన్స్‌కు కొత్త లుక్ తీసుకువచ్చింది. ప్రసిద్ధ బాలివుడ్ పాటలతో జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభిచారు. ‘మొదట ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆనందిస్తారు. ఆ తరువాత ఆమోదిస్తారు’ అనే మాట ఈ టీమ్ విషయంలో నిజమైంది. ‘జాజ్ డ్యాన్స్‌లో బాలీవుడ్ పాటలు ఏమిటి!’ అని ఆశ్చర్య పోయినవారే వారి ప్రదర్శన చూసిన తరువాత ‘ఆహా! అద్భుతం’ అని మెచ్చుకున్నారు. ‘హిందీ సినిమా పాటలకే కాదు సౌత్ ఇండియన్ మ్యూజిక్కు కూడా జాజ్ డ్యాన్స్ జత చేయనున్నాం’ అంటుంది రోహిణి నాయర్. ‘మీరు చూస్తే లావుగా కనిపిస్తారు. ఇంత చక్కగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతున్నారు!’ అని చాలామంది రాధిక మాయదేవ్ను అడుగుతుంటారు. ఆమె ఆ సందేహానికి చెప్పే సమాధానం... ‘ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. రిథమ్ ఉంటుంది. ప్రతి బాడీకి డ్యాన్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకు అవసరమైనది సాధన మాత్రమే’ జాజ్ డ్యాన్స్‌లో కంటెంపరరీ, పుంక్, స్ట్రీట్ స్టైల్, లిరికల్ అండ్ కమర్శియల్...అంటూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటోంది ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. -
హోండా జాజ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్షిప్ హ్యాచ్ బ్యాక్ కారు జాజ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. పెట్రోలు సీవీటీ వేరియంట్‌గా మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్ వేరియంట్ హోండా జాజ్ ధరను రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూం,ఢిల్లీ) నిర్ణయించింది. కారు బయటా, లోపల స్టయిలిష్ డిజైన్‌తో రేడియంట్ రెడ్, ఆర్చిడ్ వైట్ పర్ల్ కరల్స్ లో దీన్ని ఆవిష్కరించింది. దీంతోపాటు హోండా అమేజ్, హోండా డబ్యుఆర్-వీ లో కూడా ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. హోండా అమేజ్ ధర రూ.7.86లక్షలుగా, డబ్యుఆర్-వీ ధరను రూ.9.35లక్షలుగా నిర్ణయించింది. జాజ్ తప్ప మిగిలిన రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో లభ్యమవుతున్నాయి. -
22,834 హోండా కార్లు వెనక్కు
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22,834 కార్లను హోండా రీకాల్ చేసింది. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు అవసరమైన ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సవరించేందుకు వెనక్కు పిలిచింది. తకాటా కార్పొరేషన్ ఈ బ్యాగ్‌లను అమర్చనుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2013లో తయారు చేసిన హోండా సిటీ, జాజ్, అక్కార్డ్వంటి హోండా కార్లన్నింటిని రీకాల్ చేసింది. కొత్తగా అమర్చనున్న తకాటా ఎయిర్ బ్యాగ్‌లను ఉచితంగా అందించనున్నామని, తమ వినియోగదారుల నుంచి ఇందుకోసం ఎలాంటి వసూళ్లు చేయడం లేదని హోండా తెలిపింది. -
మార్కెట్లోకి హోండా జాజ్న్యూకార్
-
మళ్లీ హోండా జాజ్
♦ పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభ్యం ♦ ధరల శ్రేణి రూ.5.3 లక్షల నుంచి రూ.8.59 లక్షలు సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన హోండా కంపెనీ జాజ్ మోడల్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తెచ్చింది. మూడో తరం జాజ్ మోడల్‌ను హోండా కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కొత్త జాజ్ లభిస్తుందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కత్సుషి ఇనోయుయి చెప్పారు. పెట్రోల్ వేరి యంట్ ధరలు రూ.5.3 లక్షల నుంచి రూ.7.29 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.8.59 లక్షల రేంజ్లో, ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.7.85 లక్షల రేంజ్లో ఉన్నాయని తెలిపారు. గతంలో జాజ్ కారు తయారీకి 72% స్థానిక విడిభాగాలను ఉపయోగించేవారమని, ఈ కొత్త జాజ్‌లో ఇది 90%కి పైగా పెరిగిందన్నారు. అందుకే పోటీని తట్టుకునేలా ధరలను నిర్ణయించగలిగామని చెప్పారు. ఈ కారు లీటరు డీజిల్‌తో 27.3 కి.మీ, లీటరు పెట్రోలుతో 18.7 కి.మీ మైలేజీ ఇస్తుందని కత్సుషి పేర్కొన్నారు. అమెరికా, జపాన్‌తో సహా మొత్తం 75 దేశాల్లో జాజ్ కార్లను విక్రయిస్తున్నామని.. డీజిల్ వేరియంట్‌ను ఒక్క భారత్‌లోనే ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.