
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో నూతన వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వీఎక్స్ సీవీటీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు ధరల శ్రేణి రూ.8.56 లక్షల నుంచి రూ.9.56 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా, అంతరాయం లేని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు తాజా వేరియంట్‌లో ఉన్నట్లు వివరించింది.
ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో ఈకారు అందుబాటులో ఉంది. మా కస్టమర్లలో 20 శాతం మంది సీవీటీ టెక్నాలజీని ఎంపికచేసుకున్నారు. నూతన వేరియంట్‌తో వీరి ముందున్న ఆప్షన్లు మరింతగా పెరిగాయి’ అని అన్నారు. ఈ వేరియంట్‌కు మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment