HCIL
-
వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్ కార్లు..బుకింగ్స్ షురూ..!
న్యూఢిల్లీ: కొత్తగా ప్రకటించిన సిటీ కారు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్ ’ఇ:హెచ్ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వెల్లడించింది. రాజస్థాన్‌లోని తాపుకారా ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తున్నట్లు వివరించింది. హోండా సిటీ ఇ:హెచ్ఈవీని వచ్చే నెల తొలినాళ్లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ టకుయా సుమురా తెలిపారు. డీలర్ల దగ్గర రూ. 21,000 లేదా కంపెనీ వెబ్సైట్లో రూ. 5,000 చెల్లించడం ద్వారా కారును బుక్ చేసుకోవచ్చని వివరించా రు. ఇందులో విశిష్టమైన సెల్ఫ్ చార్జింగ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుందని, లిథియం అయాన్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. (ఏది ముందైతే అది) వివరించారు. చదవండి: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..! -
మార్కెట్లోకి హోండా ‘అమేజ్’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో నూతన వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వీఎక్స్ సీవీటీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు ధరల శ్రేణి రూ.8.56 లక్షల నుంచి రూ.9.56 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా, అంతరాయం లేని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు తాజా వేరియంట్లో ఉన్నట్లు వివరించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో ఈకారు అందుబాటులో ఉంది. మా కస్టమర్లలో 20 శాతం మంది సీవీటీ టెక్నాలజీని ఎంపికచేసుకున్నారు. నూతన వేరియంట్‌తో వీరి ముందున్న ఆప్షన్లు మరింతగా పెరిగాయి’ అని అన్నారు. ఈ వేరియంట్‌కు మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నామన్నారు. -
హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కార్ల ధరలను రూ.10,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన డబ్ల్యూఆర్–వీ మోడల్ ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ముడిపదార్థాల ధరలు ఎగియడం వంటి పలు కారణాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచుతున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. హెచ్‌సీఐఎల్ రూ.4.69 లక్షలు–రూ.37 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా ఇటీవలే జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ కూడా ఏప్రిల్ నుంచి కార్ల ధరలను దాదాపు 2% పెంచుతున్నట్లు ప్రకటించింది.