ఆ కారు కొనాలంటే.. నోటు బాధలేదు!
ఆ కారు కొనాలంటే.. నోటు బాధలేదు!
Published Mon, Nov 21 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల ప్రభావం.. కారు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదనే అభిప్రాయంతో హోండా కార్స్ ఇండియా కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టిన హోండా కార్స్, కొనుగోలుదారులకు 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. దీంతో కస్టమర్లు నోట్ల బాధ నుంచి తప్పించుకుని, కార్లను తేలికగా కొనుగోలు చేస్తారని హోండా కార్స్ తెలిపింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ల కొనుగోలు ప్రక్రియలో అతిపెద్ద అవాంతరంగా ఏర్పతుందని, నగదుతో కార్లను కొనుగోలు చేసే స్థాయి పడిపోతున్నట్టు అంచనావేస్తున్నట్టు హెచ్సీఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.
కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా, ఎక్స్షోరూం, ఆన్రోడ్ ఫండింగ్ డీల్స్లో 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టినట్టు చెప్పారు. కార్లను కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లకు నోట్ల రద్దుతో ఏర్పడిన అసౌకర్యానికి ఈ దోస్తి బాగా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. వేతనదారులకు, స్వయం ఉపాధి వ్యక్తులకు ఈ డీల్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్షిప్స్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, హెచ్సీఐఎల్ లైన్-అప్ అన్ని మోడల్స్కు ఈ రుణ సౌకర్యం కవర్ చేస్తుందన్నారు.
ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎక్స్ షోరూం ధరల్లో 100 శాతం, ఆన్-రోడ్ ధరల్లో 90 శాతం స్పెషల్ రిటైల్ ఫైనాన్స్ ఆఫర్స్ ఉంటాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోల్డర్స్కు అన్ని హోండా కార్ల ఆన్-రోడ్ ధరల్లో 100 శాతం లోన్ అందుబాటులో ఉంటున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు కూడా రూ.25వేల కంటే ఎక్కువగా వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 7వ వేతన కమిషన్ కిందకు వచ్చే పెన్షన్ స్కీమ్ లబ్దిదారులకు రోడ్ ఫండింగ్లో 100 శాతం ఆఫర్ చేయనుంది. బ్రియో, జాజ్, అమేజ్, మొబిలియో, సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ రేంజ్ వెహికిల్స్ను విక్రయిస్తోంది.
Advertisement
Advertisement