భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ కంపెనీ తన సి3 హ్యాచ్‌బ్యాక్‌లో టాప్ వేరియంట్ అయిన 'షైన్' విడుదల చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న లైవ్, ఫీల్ వేరియంట్ల కంటే దీని ధర ఎక్కువగా ఉంది. ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ధర:
మార్కెట్లో విడుదలైన కొత్త సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ టాప్-స్పెక్ ట్రిమ్ షైన్ ధర రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో లేని అనేక ఫీచర్లను పొందుతుంది, కావున ఈ కారు ధర దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 12,000 ఎక్కువ.
డిజైన్ & ఫీచర్స్:
చూడటానికి సిట్రోయెన్ సి3 దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగా కనిపించినప్పటికీ కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ కెమెరా, మ్యాన్యువల్ డే/నైట్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ వంటి వాటిని చూడవచ్చు. అంతే కాకూండా రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ ఉన్నాయి.ఇవి ప్రస్తుతం C3 షైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో మాదిరిగా కాకుండా షైన్ వేరియంట్ 15 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్స్ పొందుతుంది. ఆదిమాత్రమే కాకుండా C3 ఇప్పుడు దాదాపు 35 కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉన్న My Citroen Connect యాప్ కూడా పొందుతుంది. 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటివి ప్రామాణికంగా అందుబాటులో ఉంటాయి.
పవర్‌ట్రెయిన్స్:
కొత్త సిట్రోయెన్ సి3 షైన్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 బిహెచ్‌పి పవర్ & 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.
ప్రత్యర్థులు:
దేశీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న సిట్రోయెన్ సి3 ఇకపై షైన్ వేరియంట్లో లభిస్తుంది. కావున సి3 అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment