ఎంజీ మోటార్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందగలిగింది. కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా చరిత్ర తిరగరాసిన ఈ కంపెనీ త్వరలో ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ లాంచ్ డేట్, రేంజ్, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లాంచ్ టైమ్:
ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల 26న (2023 ఏప్రిల్ 26) దేశీయ మార్కెట్లో 'కామెట్ ఈవీ' (Comet EV) విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ సమయంలో ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడిస్తుంది, ఆ తరువాత అన్ని వేరియంట్స్ ధరలను మే నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'సిట్రోయెన్ సి3'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.
అంచనా ధరలు:
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న కారుని విడుదల చేయనుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా వెల్లడికాలేదు.
(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?)
డిజైన్:
ఈ చిన్న కారు చూడగానే ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంది. కావున ఇది ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లకంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం రెండు డోర్స్ కలిగి మంచి కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని ఫోటోల ద్వారా ఈ కారు డిజైన్ చూడవచ్చు.
ఫీచర్స్:
ఆధునిక కాలంలో విడుదలవుతున్న దాదాపు అన్ని కార్లు లగ్జరీ ఫీచర్స్ పొందుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంజి కామెట్ ఈవీ సరసమైన ధర వద్ద లభించే మంచి ఫీచర్స్ కలిగిన కారు కావడం విశేషం. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకుండా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కలిగిన, నాలుగు-సీట్ల కారు ఈ కామెట్ ఈవీ. కార్ టెక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్రైవ్ మోడ్స్, వాయిస్ కమాండ్ వంటివి ఇందులో లభిస్తాయి.
(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)
బ్యాటరీ ప్యాక్ & రేంజ్:
త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు, కానీ ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఏప్రిల్ 26 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment