సరికొత్త లంబోర్ఘిని కారు: 312 కిమీ/గం స్పీడ్ | Lamborghini Urus SE Launched in India | Sakshi
Sakshi News home page

సరికొత్త లంబోర్ఘిని కారు: 312 కిమీ/గం స్పీడ్

Published Fri, Aug 9 2024 6:50 PM | Last Updated on Fri, Aug 9 2024 8:17 PM

Lamborghini Urus SE Launched in India

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో కొత్త 'ఉరుస్ ఎస్ఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్ షోరూమ్). అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన కొత్త ఉరుస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ 4.0 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 620 hp, 800 Nm టార్క్ అందిస్తుంది. కంపెనీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయడానికి ఇంజిన్ పూర్తిగా రీ-ఇంజనీరింగ్ చేసింది. ఇది 25.9kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ (60 కిమీ రేంజ్) పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ 312 కిమీ/గం.

కొత్త ఉరుస్ ఎస్ఈ కారు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా మోడ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆఫ్ రోడింగ్ కోసం మరో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కారు ఆన్ రోడ్, ఆఫ్ రోడింగ్‌కు అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

లంబోర్ఘిని ఉరస్ ఎస్ఈ మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక వై-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్‌ ఉంటుంది. లోపల 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్ వంటివి ఎన్నో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement