భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో 'మిఫా 9' (Mifa 9) ఎంపీవీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ కారు విక్రయాలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం.
ఎంజీ మిఫా 9 కారు 2023లోనే మొదటిసారి ఆటో ఎక్స్‌పోలోలో కనిపించింది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కీయ కార్నివాల్‌కు ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు ఒట్టోమన్ సీట్లతో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్
స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫ్రంట్ ఫాసియా అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఉంటుంది. వెనుకవైపు ఎంపివి మధ్యలో లైట్ బార్‌తో వీ షేప్ ఎల్ఈడీ టైల్‌లైట్ సెటప్ ఉంటుంది. ఇది పవర్ స్లైడింగ్ రియర్ డోర్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment