ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో మరో కొత్త SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సి3 హ్యాచ్‌బ్యాక్, సి5 ఎయిర్ క్రాస్ వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కంపెనీ త్వరలోనే తన మూడవ మోడల్ విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లాంచ్ టైమ్:
సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ పేరుతొ విడుదలకానున్న ఈ లేటెస్ట్ ఎస్‌యువి ఎట్టకేలకు దేశీయ విఫణిలో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా 2023 ద్వితీయార్థంలో ఈ కొత్త కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారు సుమారు 90 శాతం స్థానీకరణను కలిగి ఉంటుంది.
డిజైన్:
కొత్త సిట్రోయెన్ సి3 CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతుంది. కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక డిజైన్ పొందుతుంది. పొడవు వెడల్పు మాత్రమే కాకుండా గణనీయమైన వీల్ బేస్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!)
దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 4.3 మీటర్ల పొడవు కలిగి హ్యుందాయ్ క్రెటా కంటే పొడవుగా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే బ్రాండ్ మోడల్స్ గుర్తుకు తెచ్చినప్పటికీ ముందు భాగంలో లోగో గ్రిల్ భాగంలో నిక్షిప్తం చేశారు. అంతే కాకుండా హాలోజన్ హెడ్ లాంప్స్ కలిగి ఫ్రంట్ బంపర్ పొడవుగా రౌండ్ ఫాగ్ లాంప్స్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, రియర్ ప్రొఫైల్ పొవాడైన టెయిల్ గేట్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
ఫీచర్స్:
ఇంటీరియర్ విషయానికి వస్తే, సి3 ఎయిర్‌క్రాస్ రెండు సీటింగ్ ఆప్షన్స్ పొందుతుంది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి మూడు వరుసలతో వస్తుంది. 5 సీటర్ కారులో 444 లీటర్ల బూట్ స్పేస్, 7 సీటర్ కార్లు 511 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే సమయంలో 10.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అలాగే ఉంటుంది. అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా అప్డేట్ పొందుతుంది. మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటాయి.
(ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..)
ఇంజిన్ వివరాలు:
సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 110 హెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటాయి. ఆటోమాటిక్ గేర్ బాక్స్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త SUVలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండదు.
ప్రత్యర్థులు:
భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ లేటెస్ట్ SUV ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి.
ఈ కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment