భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).
అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)
రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.
ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment