భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
హోండా షైన్ (Honda Shine)
రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.
బజాజ్ ప్లాటినా (Bajaj Platina)
సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)
యమహా కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్‌లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment