Lokesh Kanagaraj Gets a Brand New BMW 7 Series Car Priced at Rs 1.70 Cr - Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj:‍ త్వరలో సినిమా రిలీజ్.. ఇప్పుడేమో ఖరీదైన కారు

Published Thu, Aug 17 2023 4:43 PM | Last Updated on Thu, Aug 17 2023 5:04 PM

Leo Movie Director Lokesh Kanagaraj New BMW Car  - Sakshi

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే తమిళ్ వాళ్ల కంటే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే గ్యాంగస్టర్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. 'ఖైదీ', 'విక్రమ్'తో మన దగ్గర కోట్లాది మంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న లోకేశ్.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!)

ప్రస్తుతం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో డిఫరెంట్ సినిమాలు తీస్తున్న లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీశాడు. దానికి కమల్‌హాసన్ 'విక్రమ్' మూవీతో లింక్ చేశాడు. ఇప్పుడు దళపతి విజయ్‌తో 'లియో' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 20న ఇది థియేటర్లలోకి రానుంది. అంటే రెండు నెలల టైముంది. ఈ గ్యాప్‌లో కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.

కార్లలో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారుని ఇప్పుడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత రూ.కోటి 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. విజయ్ 'లియో' కోసం రూ.70 కోట్లు అందుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఇలా హీరోలని మించి లోకేశ్ క్రేజ్ సంపాదించాడు.

(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement