ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' (Maruti Suzuki Fronx) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధరలు & బుకింగ్స్:
దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైన కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 7.47 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 13.14 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్).
మారుతి సుజుకి రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంక్స్ 15 వేలకంటే ఎక్కువ సంక్యలో బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
డిజైన్:
మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ వంటి వాటితో పాటు సైడ్ ప్రొఫైల్‌లో 17 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
పరిమాణం పరంగా కూడా ఈ SUV చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ, ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
(ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!)
ఫీచర్స్:
మారుతి ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందిస్తుంది, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్:
కొత్త మారుతి ఫ్రాంక్స్ ఆర్కిటిక్ వైట్, ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు రంగులలో లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయల్-టోన్ ఎంపికలుగా ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ అందుబటులో ఉంటాయి.
పవర్‌ట్రెయిన్స్:
ఫ్రాంక్స్ ఎస్‌యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి.
(ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ)
1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్‌లో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఈ కొత్త ఎస్‌యువి ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.
ప్రత్యర్థులు:
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment