Maruti Suzuki: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కొత్త XL7 ఎస్‌యువిని విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త 7 సీటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త ఎక్స్ఎల్7 ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎక్స్ఎల్6 కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది టయోటా ఇన్నోవా క్రిష్టాకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో పరిచమైన ఈ ఎస్‌యువి మంచి ప్రజాదరణ పొందుతోంది. కాగా ఇక భారతీయ తీరాలకు రావడానికి సన్నద్ధమవుతోంది.
మారుతి ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్
మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ చాలా కొత్తగా ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ డ్యాష్‌బోర్డ్, స్టాండర్డ్ మిడిల్ ఆర్మ్‌రెస్ట్‌లు, లెదర్డ్ స్ట్రీరింగ్ వీల్, పుష్ బటన్, స్టాప్ కీలెస్ ఎంట్రీ, రియర్‌వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఎక్స్ఎల్7 ఎస్‌యువిలో 1.5 లీటర్ కే15బి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,400 rpm వద్ద 138 Nm టార్క్ & 6000 rpm వద్ద 104 bhp పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 5 మ్యాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుందని ఆశిస్తున్నాము. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్‌యువి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment