
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు.
ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్‌లో జడ్‌ఎస్ ఈవీ మోడల్‌ను విక్రయిస్తోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment