ఖరీదైన ఇల్లు అమ్మేసి లగ్జరీ కారు కొన్న హీరోయిన్ | Kangana Ranaut New Range Rover Car Details | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: రూ.32 కోట్ల బంగ్లా అమ్మేసింది.. ఇప్పుడేమో

Published Mon, Sep 30 2024 12:46 PM | Last Updated on Mon, Sep 30 2024 12:57 PM

Kangana Ranaut New Range Rover Car Details

మన దగ్గరేమో గానీ బాలీవుడ్‌లో సెలబ్రిటీలు చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కంగనా రనౌత్ చేరింది. మొన్నీ మధ్యే రూ.32 కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మేసిన కంగన.. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ గుర్తొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చాలామందిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగానూ గెలిచింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

ఈ మధ్య కాలంలో 'ఎమర్జెన్సీ' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందిరా గాంధీగా కంగన కనిపించనుంది. లెక్క ప్రకారం సెప్టెంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు కట్ చేయాలని చెప్పింది. అప్పటినుంచి దీని రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.

ఇవన్నీ పక్కనబెడితే మొన్నీమధ్యే పాలి హిల్స్‌లోని రూ.32 కోట్ల ఖరీదైన బంగ్లాని అమ్మేసిన కంగన.. ఇప్పుడు తన ఆఫీస్ అవసరాల కోసం రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ అనే లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్‌లో దీని ఖరీదు దాదాపు రూ.3.81 కోట్లుగా ఉంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement