range rover autobiography
-
ఖరీదైన ఇల్లు అమ్మేసి లగ్జరీ కారు కొన్న హీరోయిన్
మన దగ్గరేమో గానీ బాలీవుడ్లో సెలబ్రిటీలు చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కంగనా రనౌత్ చేరింది. మొన్నీ మధ్యే రూ.32 కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మేసిన కంగన.. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ గుర్తొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చాలామందిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగానూ గెలిచింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఈ మధ్య కాలంలో 'ఎమర్జెన్సీ' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందిరా గాంధీగా కంగన కనిపించనుంది. లెక్క ప్రకారం సెప్టెంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు కట్ చేయాలని చెప్పింది. అప్పటినుంచి దీని రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.ఇవన్నీ పక్కనబెడితే మొన్నీమధ్యే పాలి హిల్స్‌లోని రూ.32 కోట్ల ఖరీదైన బంగ్లాని అమ్మేసిన కంగన.. ఇప్పుడు తన ఆఫీస్ అవసరాల కోసం రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ అనే లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ఖరీదు దాదాపు రూ.3.81 కోట్లుగా ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్ ఒక వీడియను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్, డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ కంట్రోల్ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్‌ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్‌తో రీడిజైన్ చేయబడిన బంపర్తోపాటు అప్‌గ్రేడెడ్ డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్‌ను కలిగి ఉందీ కారు. కాగా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్‌లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్!
'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చి చేరింది. హీరో రాంచరణ్ ఆ కొత్త సభ్యురాలిని తన ఇంట్లోకి చేర్చాడు. అయితే అది బేబీనో... పక్షో..జంతువో కాదండోయ్.... సరికొత్త కారు. అలాంటిలాంటి కారు కాదండోయ్...సరికొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. చెర్రీ తన కోసం కొనుకున్న ఈ కారు ధర అక్షరాలా రూ. 3.5 కోట్లు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఈ కారును కొనుగోలు చేసిన తొలి వ్యక్తి చెర్రీనే. విశాఖ హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం 'మేము సైతం' కార్యక్రమం ప్రెస్‌మీట్‌కు రాంచరణ్... రేంజ్ రోవర్‌ను స్వయంగా డ్రైవ్ చేసుకుని వచ్చాడు. చెర్రీ పక్కనే నాగార్జున...తనయుడు అఖిల్ కూడా ఉన్నాడు. సరికొత్త కారుతో... వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. దాంతో రాంచరణ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. రాంచరణ్‌కి కార్లంటే తగని ఇష్టం. అందుకు తగ్గట్టే చిరంజీవి కూడా తనయుడికి ఖరీదైన కార్లు గిప్ట్ ఇచ్చేవారు. కాగా ఇటీవలే తండ్రి పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్ ....ల్యాండ్ క్రూజర్ విఎక్స్, వి8 మోడల్‌కి చెందిన కారును బహుమతిగా ఇచ్చాడు. గతంలో ఈ హీరో ...చిరంజీవికి రోల్స్ రాయిస్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ లెక్కన వింటుంటే... చెర్రీ కాంపౌండ్‌లో ఖరీదైన కార్లు చాలానే ఉన్నట్లున్నాయి.