Maruti Suzuki Jimny price leaked ahead of launch - Sakshi
Sakshi News home page

Maruti Jimny: విడుదలకు ముందే లీకైన జిమ్నీ ధరలు - పూర్తి వివరాలు

Apr 24 2023 12:18 PM | Updated on Apr 24 2023 12:35 PM

Maruti jimny price leaked ahead of launch - Sakshi

మారుతి సుజుకి తన 5 డోర్స్ జిమ్నీ SUVని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి ఎక్కువ మంది దీని కొనుగోలుకు వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిమ్నీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. కాగా ఈ ఆఫ్ రోడర్ ధరలు విడుదలకు ముందే వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ 5-డోర్‌ మోడల్‌కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న మారుతి జిమ్నీ త్వరలోనే అధికారికంగా విడుదలకానుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈ ఎస్‌యువి ధరలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి.

షాన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటిస్తుంది. 

డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. ఇది K15B పెట్రోల్ ఇంజన్‌ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement