ప్రపంచంలోనే అత్యత పాపులర్ ఆటోమోటివ్ షోలలో ఒకటైన 'జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో' వచ్చే నెల 5 నుంచి 14 వరకు జరగనుంది. ఎన్నెన్నో కొత్త వాహనాలకు వేదిక కానున్న ఈ షో ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఇక్కడ ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూపర్ కారు ENTOP కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త కంపెనీల కార్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇందులో తాలిబన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్‌లో సూపర్‌కార్ మాడా 9 అడుగెట్టనున్నట్లు ఎన్‌టాప్ వ్యవస్థాపకుడు 'మహమ్మద్ రెజా అహ్మదీ' తెలిపారు. ఇప్పటికే ఈ కారు ఆఫ్ఘనిస్తాన్‌లోని నిమ్రోజ్ ప్రావిన్స్ నుంచి షిప్పింగ్ కంటైనర్‌లో బయలుదేరినట్లు సమాచారం.
ఈ సూపర్‌కారుని ఎగుమతి చేసే సమయంలో దాని వ్యవస్థపాకుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్లను ఎగుమతి చేయడాన్ని నిరోధించే కొన్ని చట్టపరమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను తాలిబన్లు ఎలా పరిష్కరించారనేది స్పష్టంగా తెలియలేదు.
జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోకు హాజరు కావడం కంపెనీకి చాలా ముఖ్యమైనదని మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉన్నట్లు.. దానిని నిజమైన కారుగా మార్చడానికి ఆర్థిక సహాయం కావాలని చెబుతున్నారు. ఈ ప్రదర్శన తరువాత బలమైన పెట్టుబడి దారులు సహాయపడే అవకాశం ఉందని.. ఆఫ్ఘన్ ఆటోమోటివ్ తయారీ భవిష్యత్తుకు ఈ దశ చాలా కీలకమని అన్నారు.
ఎన్‌టాప్ మడా 9 సూపర్ కార్..
ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ కారు రూపు దిద్దుకుంది. దీనిని ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సుమారు 30 మంది ఇంజినీర్ల బృందం తయారు చేశారు. ప్రస్తుతం ఇది టయోటా కరోలా ఇంజన్‌తో వస్తుంది. కానీ ఇది ఈ సూపర్ కారు వేగానికి అనుకూలంగా మోడిఫై చేశారు. అయితే ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో లభించే అవకాశం ఉందిని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment