Geneva Auto Show
-
జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో - ప్రత్యేక ఆకర్షణగా 'సిముర్గ్' (ఫోటోలు)
-
జెనీవా మోటార్ షోలో అడుగెట్టనున్న తాలిబన్ సూపర్‌కారు ఇదే!
ప్రపంచంలోనే అత్యత పాపులర్ ఆటోమోటివ్ షోలలో ఒకటైన 'జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో' వచ్చే నెల 5 నుంచి 14 వరకు జరగనుంది. ఎన్నెన్నో కొత్త వాహనాలకు వేదిక కానున్న ఈ షో ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఇక్కడ ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూపర్ కారు ENTOP కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త కంపెనీల కార్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇందులో తాలిబన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్‌లో సూపర్‌కార్ మాడా 9 అడుగెట్టనున్నట్లు ఎన్‌టాప్ వ్యవస్థాపకుడు 'మహమ్మద్ రెజా అహ్మదీ' తెలిపారు. ఇప్పటికే ఈ కారు ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ నుంచి షిప్పింగ్ కంటైనర్‌లో బయలుదేరినట్లు సమాచారం. ఈ సూపర్కారుని ఎగుమతి చేసే సమయంలో దాని వ్యవస్థపాకుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్లను ఎగుమతి చేయడాన్ని నిరోధించే కొన్ని చట్టపరమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను తాలిబన్లు ఎలా పరిష్కరించారనేది స్పష్టంగా తెలియలేదు. జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోకు హాజరు కావడం కంపెనీకి చాలా ముఖ్యమైనదని మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉన్నట్లు.. దానిని నిజమైన కారుగా మార్చడానికి ఆర్థిక సహాయం కావాలని చెబుతున్నారు. ఈ ప్రదర్శన తరువాత బలమైన పెట్టుబడి దారులు సహాయపడే అవకాశం ఉందని.. ఆఫ్ఘన్ ఆటోమోటివ్ తయారీ భవిష్యత్తుకు ఈ దశ చాలా కీలకమని అన్నారు. ఎన్‌టాప్ మడా 9 సూపర్ కార్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ కారు రూపు దిద్దుకుంది. దీనిని ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు 30 మంది ఇంజినీర్ల బృందం తయారు చేశారు. ప్రస్తుతం ఇది టయోటా కరోలా ఇంజన్‌తో వస్తుంది. కానీ ఇది ఈ సూపర్ కారు వేగానికి అనుకూలంగా మోడిఫై చేశారు. అయితే ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో లభించే అవకాశం ఉందిని చెబుతున్నారు. -
జెనీవాలో అంతర్జాతీయ ఆటో షో
-
టాటా మోటార్స్ తొలి స్పోర్ట్స్‌కారు ‘రేస్‌మో’
జెనీవా ఆటో షోలో ఆవిష్కరణ జెనీవా: టాటా మోటార్స్ కంపెనీ తన తొలి స్పోర్ట్స్ కారు, రేస్‌మోను జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. టాటా సన్స్ ఎమిరిటస్ రతన్‌టాటా, టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది. తన ఉపబ్రాండ్ టామో కింద ఈ రేస్‌మో స్పోర్ట్స్‌కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తెస్తోంది. టామో బ్రాండ్ కింద వస్తున్న తొలి మోడల్– ఈ రెండు సీట్ల స్పోర్ట్స్ కూపేతో పాటు సెడాన్ టైగర్, ఎస్యూవీ నెక్సన్, యూరప్ మార్కెట్ కోసం ఉద్దేశించిన పిక్సెల్ కారు మోడళ్లను కూడా ఈ ఆటో షోలో టాటా మోటార్స్ ప్రదర్శించింది. యూత్‌ఫుల్ బ్రాండ్‌గా టాటా మోటార్స్... టాటా మోటార్స్‌ను యూత్ఫుల్బ్రాండ్గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా రేస్‌మో పేరుతో స్పోర్ట్స్ కారును అందిస్తున్నామని టాటా మోటార్స్ సీఈఓ, ఎండీ, గుంటర్ బుశ్చక్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కారును మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ నావిగేషన్, రిమోట్ మానిటరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మైక్రోసాఫ్ట్ అజూర్ పవర్‌తో కూడిన మెషీన్ లర్నింగ్ తదితర అధునాతన, వినూత్న ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామి, మైక్రోసాఫ్ట్ రేస్మోప్లస్ పేరుతో ఒక వీడియో గేమ్‌ను ఆఫర్ చేస్తోంది. మరో 22 రోజుల్లో టైగర్ మోడల్‌ను భారత్‌లోకి తెస్తామన్నారు. విలువైన యాత్ర...: రతన్ టాటా 20 ఏళ్ల క్రితం ఇండికా కారుతో తమ యాత్ర ప్రారంభమైందని రతన్ టాటా చెప్పారు. తాజాగా అందిస్తున్న రేస్‌మో దాకా తమ యాత్ర విలువైనదిగా సాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంపెనీ డిస్ప్లే చేసిన మోడల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నానో కారుపై వ్యాఖ్యానించమని కోరగా ఆయన నిరాకరించారు. జెనీవాలో జరుగుతున్న ఈ ఆటో షోకు మంగళవారం మీడియాను ప్రత్యేకంగా అనుమతించారు. ఈ నెల 9–19 మధ్య ప్రజలను అనుమతిస్తారు. -
అబ్బురపరిచే ఆటో షో...