showcause
-
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్‌కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్‌కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
జెనీవా మోటార్ షోలో అడుగెట్టనున్న తాలిబన్ సూపర్‌కారు ఇదే!
ప్రపంచంలోనే అత్యత పాపులర్ ఆటోమోటివ్ షోలలో ఒకటైన 'జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో' వచ్చే నెల 5 నుంచి 14 వరకు జరగనుంది. ఎన్నెన్నో కొత్త వాహనాలకు వేదిక కానున్న ఈ షో ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఇక్కడ ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూపర్ కారు ENTOP కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త కంపెనీల కార్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇందులో తాలిబన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్‌లో సూపర్‌కార్ మాడా 9 అడుగెట్టనున్నట్లు ఎన్‌టాప్ వ్యవస్థాపకుడు 'మహమ్మద్ రెజా అహ్మదీ' తెలిపారు. ఇప్పటికే ఈ కారు ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ నుంచి షిప్పింగ్ కంటైనర్‌లో బయలుదేరినట్లు సమాచారం. ఈ సూపర్కారుని ఎగుమతి చేసే సమయంలో దాని వ్యవస్థపాకుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్లను ఎగుమతి చేయడాన్ని నిరోధించే కొన్ని చట్టపరమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను తాలిబన్లు ఎలా పరిష్కరించారనేది స్పష్టంగా తెలియలేదు. జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోకు హాజరు కావడం కంపెనీకి చాలా ముఖ్యమైనదని మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉన్నట్లు.. దానిని నిజమైన కారుగా మార్చడానికి ఆర్థిక సహాయం కావాలని చెబుతున్నారు. ఈ ప్రదర్శన తరువాత బలమైన పెట్టుబడి దారులు సహాయపడే అవకాశం ఉందని.. ఆఫ్ఘన్ ఆటోమోటివ్ తయారీ భవిష్యత్తుకు ఈ దశ చాలా కీలకమని అన్నారు. ఎన్‌టాప్ మడా 9 సూపర్ కార్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ కారు రూపు దిద్దుకుంది. దీనిని ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు 30 మంది ఇంజినీర్ల బృందం తయారు చేశారు. ప్రస్తుతం ఇది టయోటా కరోలా ఇంజన్‌తో వస్తుంది. కానీ ఇది ఈ సూపర్ కారు వేగానికి అనుకూలంగా మోడిఫై చేశారు. అయితే ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో లభించే అవకాశం ఉందిని చెబుతున్నారు. -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్ ఆర్డీఓ కృష్ణ షోకాజ్ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్చార్జి తహసీల్దార్ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్బిఐ గవర్నర్‌కు సమాచార కమిషన్ షోకాజ్ నోటీసు
-
రాహుల్‌కు ఈసీ షోకాజ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఇతర సంప్రదింపులేవీ లేకుండా ఈసీ తదుపరి చర్యలు చేపడుతుందని పేర్కొంది. బీజేపీ అధికారంలోకి వస్తే హింసాకాండలో 22 వేలమంది చనిపోతారంటూ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఈసీ నోటీసు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ బహిరంగ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈవీఎం ప్రాంతంలోకి ప్రవేశంపై లోతుగా దర్యాప్తు ఇలావుండగా రాహుల్ ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఉన్న ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఎన్నికల నిబంధనలు ఏవైనా ఉల్లంఘించారా? అనే అంశం నిర్ధారించేందుకు మరింత లోతుగా విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. దీనిపై సోమవారానికల్లా నివేదిక అందుతుందని భావిస్తున్న కమిషన్.. అదేరోజు దానిపై నిర్ణయం తీసుకోనుంది. గత బుధవారం తన నియోజకవర్గమైన అమేథీలో పోలింగ్ సందర్భంగా రాహుల్ ఈవీఎం సమీపానికి వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
పవన్ బన్సల్ కు ఎన్నికల సంఘం షోకాజ్
మామూలు టైమ్ లో ఏదంటే అది మాట్లాడవచ్చు కానీ ఎన్నికల సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కోడ్ ఉల్లంఘనో, ఏది ఉల్లంఘన కాదో చెప్పడం కష్టం. చండీగఢ్ నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి పవన్ బన్సల్ ఎప్పట్లాగే బిజెపిపై మతపరమైన ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల కమీషన్ ఆయనకు అలా ఎందుకు మాట్లాడావంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బన్సల్ ఓట్లడిగేందుకు ముస్లింల సభకి వెళ్లి 'ముస్లింలు బాబరీ కూల్చివేతను, గోధ్రా నరమేథాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు' అని తనకు ఓట్లేయమని అడిగారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని బిజెపి ఆరోపించింది. అంతే కాదు. కాంగ్రెస్ నేతలు బిజెపి అభ్యర్థి, నటి కిరణ్ ఖేర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా బిజెపి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం మూడు రోజుల్లో తన వాదనను వినిపించాల్సిందిగా పవన్ బన్సల్ కి నోటీసులు జారీ చేసింది. పవన్ భాయి ఇప్పుడు అసలు తానేం మాట్లాడాడు, అందులో అభ్యంతరకరమైనదేమిటి తెలుసుకునేందుకు తన స్పీచిని తానే వింటూ కాలం గడుపుతున్నారు. 'పవన్ బన్సల్ చాలా తెలివైన వారు. ఆయన అనుభవజ్ఞుడైన కేంద్ర మంత్రి. ఆయన ఇలాంటి మాటాలు మాట్లాడరు' అంటున్నారు ఆయన అనుచరులు.