
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
(ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?)
ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు.
(ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment